Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

American Tears Indian Flag | భారత జెండాను చింపేసిన అమెరికన్​.. నెటిజన్ల ఆగ్రహం

Srinivas Kolluri
Last updated: June 3, 2026, 10:30 am 10:30 am
Srinivas Kolluri
Share
American Tears Indian Flag

అక్షరటుడే, వెబ్​డెస్క్: American Tears Indian Flag | భారత విద్యార్థులు, సాఫ్ట్​వేర్​ ఉద్యోగులకు అమెరికా కలల దేశం. అక్కడకు వెళ్లి సెటిల్​ కావాలని ఎంతో మంది కలలు కంటారు. ఇప్పటికే లక్షలాది మంది అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే రానున్న రోజుల్లో భారతీయులకు అమెరికా (America) అంత సురక్షితం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పలువురు అమెరికన్లు భారతీయులపై ద్వేషం పెంచుకుంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు.. భారత్ (India) వెళ్లిపొండి అంటూ అసభ్య పదజాలంతో దూషించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో వ్యక్తి ఏకంగా భారత జెండాను చింపేశాడు. అతడు జెండాను చింపుతుండుగా.. పలువురు కేరింతలు కొడుతూ అతడికి మద్దతుగా నిలవడం వారిలో భారత వ్యతిరేకతకు అద్దం పడుతోంది.

American Tears Indian Flag | టెక్సాస్​లో..

టెక్సాస్‌కు చెందిన ఓ వ్యక్తి భారత జాతీయ జెండాను చించివేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆ పోస్ట్ ప్రకారం, ఈ సంఘటన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో జరిగింది. ఆ వీడియోలో, నోటిలో సిగరెట్‌తో సిటీ హాల్ బయట నిలబడి ఉన్న ఒక వ్యక్తి, తన చుట్టూ ఉన్న పలువురు కేరింతలు కొడుతుండగా భారత జెండాను చంపేశాడు. ఉత్తర డల్లాస్‌లో భారత వలసలకు వ్యతిరేకంగా స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

American Tears Indian Flag

American Tears Indian Flag | ఇది సరికాదు

ఈ వీడియో సోషల్ మీడియా (Social Media) వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులతో పాటు పలువురు అమెరికన్లు సైతం అతడి చర్యను తప్పు బడుతున్నారు. ఈ వలసదారులు చట్టబద్ధంగా వచ్చారు. యూఎస్ రాజ్యాంగం ప్రకారం వారికి హక్కులు ఉన్నాయి. మీరు మర్యాదగా, గౌరవంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. కానీ ఇది మాత్రం సరికాదని ఓ వ్యక్తి పోస్ట్ చేశారు.

American Tears Indian Flag | పెరుగుతున్న ద్వేషం

భారత్​కు చెందిన ఎంతో మంది నైపుణ్యం కలిగిన వారు హెచ్​–1బీ వీసాలతో అగ్రరాజ్యం అమెరికాలో కొలువులు చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థులు అక్కడకు వెళ్లి చదువుకుంటున్నారు. అక్కడి యూనివర్సిటీలకు భారత విద్యార్థులు ఏటా రూ.వేల కోట్లు చెల్లిస్తున్నారు. అయితే భారతీయుల జనాభా పెరుగుతుండటం, స్థానిక యువతకు ఉపాధి లభించకపోవడంతో కొంతమంది అమెరికన్లలో భారతీయులపై ద్వేషం పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో దాడులకు తెగబడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో అవమానిస్తున్నారు. ఇలాంటి చర్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు. అమెరికాలోని భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

American Tears Indian Flag

తారా స్థాయికి చేరిన పిచ్చి!

అమెరికాలోనీ టెక్సాస్ రాష్ట్రంలో భారతీయ జెండాను చంపేసిన స్థానికుడు!

pic.twitter.com/cngN76xZpD

— UttarandhraNow (@UttarandhraNow) June 3, 2026

ఇది కూడా చదవండి..: Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

TAGGED:American Tears Indian FlagAnti Indian SentimentFrisco TexasIndian diaspora USAIndian Flag IncidentTexas NewsUS Immigration Debateviral video news
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article CMRF Transgender Healthcare CMRF Transgender Healthcare | చరిత్రలో తొలిసారి: ట్రాన్స్‌జెండర్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీకి సీఎంఆర్ఎఫ్ సాయం!
Next Article Telangana Weather  Telangana Weather | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Vijay Political Comments
జాతీయం

Vijay Political Comments | నేను నటుడినే.. కానీ, మీరే అసలైన రాజకీయ నటులు : ప్రత్యర్థులపై దళపతి విజయ్ ఫైర్

By Naresh Chandan
Kerala Election Results |
జాతీయం

Kerala Election Results | కేరళంలో సంచలనం.. అధికార మార్పు దిశగా ఫలితాలు

By Shashi kiran Mottala
LPG Ships
జాతీయం

LPG Ships | హర్ముజ్​ను దాటిన రెండు ఎల్​పీజీ నౌకలు

By Srinivas Kolluri
NEET UG Leak
జాతీయం

NEET UG Leak | జవాబుదారీతనం అవసరం.. నీట్ విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.