Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Sangareddy Drugs Bust | మారుమూల గ్రామంలో ఫామ్​హౌస్​.. లోపల ఏం జరగుతుందో తెలిస్తే షాక్​

Srinivas Kolluri
Last updated: June 3, 2026, 12:05 pm 12:05 pm
Srinivas Kolluri
Share
Sangareddy Drugs Bust

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sangareddy Drugs Bust | మారుమూల గ్రామంలో ఉన్న ఫామ్​హౌజ్​లో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్​ దందాను పోలీసులు రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని ఓ ఫామ్​హౌజ్​పై మహారాష్ట్ర పోలీసులు (Maharashtra Police) దాడి చేసి భారీగా డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు.

సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లోని కోహీర్ మండలం పీచేర్యాగడి తండాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఆపరేషన్ స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మహారాష్ట్రలో డ్రగ్స్​ దొరకడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పీచేర్యాగడి తండాలోని ఫామ్​హౌజ్​ నుంచి వారికి డ్రగ్స్​సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు మే 29న ఫామ్​హౌజ్​పై దాడి చేశారు. ఈ వివరాలను తాజాగా వెల్లడించారు.

Sangareddy Drugs Bust | అత్యాధునిక వసతులతో..

Sangareddy Drugs Bust

ఈ ఫామ్ హౌజ్​ రెండు విస్తీర్ణంలో ఉంది. మాదకద్రవ్యాల ఉత్పత్తికి ఉపయోగించే అత్యాధునిక ప్రయోగశాల మౌలిక సదుపాయాలు అందులో ఉన్నాయి. ఈ ఆపరేషన్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్​, తయారీకి వాడే రసాయనాలు, ప్రయోగశాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కేవలం ప్రయోగశాల మౌలిక సదుపాయాల విలువ రూ.6.22 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాలు, రసాయనాలు, పరికరాల మొత్తం విలువ రూ.20.72 కోట్లుగా అంచనా వేశారు.

Sangareddy Drugs Bust | తీగ లాగితే..

Sangareddy Drugs Bust

మహారాష్ట్ర (Maharashtra)లోని థానే జిల్లా ఏప్రిల్ 4న పోలీసులు ఒక ఇంటిపై దాడి చేసి, మెఫెడ్రోన్​ను స్వాధీనం చేసుకోవడంతో ఈ కేసు ప్రారంభమైంది. ఫిరోజ్ అర్బాజ్ ఖురేషి, అతని భార్య అర్బాజ్ వకీల్ ఖురేషిలపై కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించగా.. డ్రగ్స్​ ముఠా అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ముంబైలో వరుస దాడులు నిర్వహించి, 15 మందిని అరెస్టు చేశారు. వీరస్వామి నాయుడుతో పాటు మరో ఇద్దరు నిందితులు, నాసిర్ ఇలియాస్ బాబా జానిమియా షేక్, మహమూద్ మెహబూబ్ ఖాన్‌ అనే నిందితులను హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్​లో అరెస్టు చేశారు. నాసిర్​ను విచారించగా.. ఫామ్​హౌజ్​లో డ్రగ్స్​ తయారీ గురించి సమాచారం లభించింది.

ఇది కూడా చదవండి..: Telangana Weather | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

TAGGED:Crime Investigation IndiaDrug Lab RaidFarmhouse Drug FactoryMaharashtra PoliceNarcotics SeizureSangareddy Drugs BustSangareddy Newstelangana crime news
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gold Price Today Gold Price Today | స్థిరంగా పసిడి.. స్వల్పంగా తగ్గిన వెండి!
Next Article Nellore Women Politics Nellore Women Politics | రాజకీయాల్లో ‘వారసురాళ్ల’ హవా.. రంగంలోకి సీనియర్ల కూతుళ్లు, కోడళ్లు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Medaram Development
తెలంగాణ

Medaram Development | తుది దశకు మేడారం అభివృద్ధి పనులు : మంత్రి పొంగులేటి

By Srinivas Kolluri
Bandi Bhagirath Custody
తెలంగాణ

Bandi Bhagirath Custody | బండి భగీరథ్​ పోలీస్​ కస్టడీకి కోర్టు అనుమతి

By Srinivas Kolluri
Palamuru Rangareddy Project
తెలంగాణ

Palamuru Rangareddy Project | ‘పాలమూరు – రంగారెడ్డి’ పనులు పూర్తి చేయాలి : సీఎం రేవంత్​రెడ్డి

By Shashi kiran Mottala
Bandi Sanjay Comments
తెలంగాణ

Bandi Sanjay Comments|నేను ఎలాంటివాడినో నా పార్టీ కార్యకర్తలకు తెలుసు:బండి సంజయ్

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.