GGH Plastic Surgery | నిజామాబాద్​ జీజీహెచ్​లో తొలి ప్లాస్టిక్ సర్జరీ విజయవంతం

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: GGH Plastic Surgery | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తొలి ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు సూపరింటెండెంట్ నాగమోహన్ తెలిపారు.

గాంధారి మండలానికి (Gandhari Mandal) చెందిన లచ్చవ్వ (45) అనే రోగికి ముఖం ఎడమ చెంప భాగంలో వ్యాధి నిర్ధారణ కావడంతో, ప్లాస్టిక్ సర్జన్ డా. శివాని ఆధ్వర్యంలో రోటేషన్ ఫ్లాప్​ రీ కన్​స్ట్రక్షన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్​ హెచ్​వోడీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

GGH Plastic Surgery | మరో మహిళకు..

నిజామాబాద్‌ (Nizamabad)కు చెందిన మమత అనే మహిళకు కాలి భాగంలో దీర్ఘకాలంగా మానని గాయం ఉంది. జీజీహెచ్​లో ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్లాస్టిక్ సర్జన్ శివాని రోగికి ఫ్లాప్​ కవర్, స్ప్లిట్​ తిక్​నెస్​ స్కిన్​ గ్రాఫ్టింగ్​ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విభాగాధిపతి విజయ్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. ఈ చికిత్స ద్వారా రోగి కాలును సంరక్షించడంతో పాటు, సాధారణ జీవన విధానానికి తిరిగి చేరుకునే అవకాశం కలిగిందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Gram Sabha Meetings | గ్రామ, వార్డు సభలను సమర్ధవంతంగా నిర్వహించాలి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *