Munnuru Kapu Awards | 7న మున్నూరు కాపు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Munnuru Kapu Awards | తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ (Nizamabad)​ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7న ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు అధ్యక్షుడు తోట రాజశేఖర్​ తెలిపారు.

పదో తరగతి, ఇంటర్మీడియట్ (Inter), ఈఏపీసెట్​, జేఈఈ అడ్వాన్స్​ పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రతియేటా పురస్కారాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికీ పలువురు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని రాజశేఖర్​ తెలిపారు.

Munnuru Kapu Awards | క్రీడాకారులకు..

చదువుతో పాటు ఈ ఏడాది క్రీడా రంగంలో సత్తా చాటిన వారిని కూడా సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం 2025-26 లో క్రీడల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన వారు తమ వివరాలను వెంటనే జిల్లా కమిటీకి అందజేయాలని కోరారు. ఇప్పటికీ పేరు నమోదు చేసుకున్న విద్యార్థులు కార్యక్రమానికి తమ తల్లిదండ్రులతో హాజరు కావాలన్నారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు తోట రాజశేఖర్ పటేల్, ప్రధాన కార్యదర్శి రవీందర్ పటేల్ అబ్బాపూర్, కోశాధికారి బాశెట్టి సురేష్ కుమార్ పటేల్ ప్రకటన విడుదల చేశారు.

దీనిని కూడా చదవండి : JEE Advanced Results | “మా విజయానికి మూలం కాకతీయే..!” జేఈఈ అడ్వాన్స్​డ్​ ర్యాంకర్ల మనోగతం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *