అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : BRS Membership Drive | జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (Prashanth Reddy) హాజరై మాట్లాడారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు వేముల కౌంటర్ ఇచ్చారు. మాటలు జారితే, ఎలా సమాధానం ఇవ్వాలో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తే పోయేది ఏమి లేదని పేర్కొన్నారు. ముందు మీ రాష్ట్రం పునర్నిర్మాణం చేసుకో, రాజధాని లేదు, సెక్రటేరియట్ ఆ నిర్మాణాల సంగతి చూడని ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
BRS Membership Drive | కబ్జాలు చేస్తున్న సీఎం
రాష్ట్రంలో కుంభకోణాల ప్రభుత్వం నడుస్తుందని వేముల ఆరోపించారు. రైతు డిస్కం పేరుతో విద్యుత్ శాఖ ను ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్‌లో భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.
BRS Membership Drive | ఉద్యమంలా నిర్వహించాలి

మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదును ఉద్యమంలా నిర్వహించాలన్నారు. అభివృద్ధి చేస్తానని చెప్పి అన్ని విధాల నిజామాబాద్ నగరాన్ని చెత్తకుప్పలా తయారుచేసిన ఎమ్మెల్యే ధన్పాల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న SIR కార్యక్రమంలో BRS పార్టీ బూత్ ఏజెంట్లు, బూత్ ఇంచార్జులు అత్యంత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ఓటరు జాబితాల్లో ఎలాంటి లోపాలు, పొరపాట్లు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని కోరారు.
BRS Membership Drive | పార్టీని బలోపేతం చేయాలి
మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు బీఆర్ఎస్ చేసిన కృషిని ప్రజలు ఎన్నటికీ మరచిపోరని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా BRS చరిత్రలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతం చేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటిని సంప్రదించాలని సూచించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే మాట్లాడుతూ… బూత్ కమిటీలు బలంగా ఉంటేనే పార్టీ బలపడుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో దండు నీతు కిరణ్ శేఖర్, సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, మతీన్ తదితరులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : GGH Plastic Surgery | నిజామాబాద్ జీజీహెచ్‌లో తొలి ప్లాస్టిక్ సర్జరీ విజయవంతం
