Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Congress Show Cause Notice | పీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు

Srinivas Kolluri
Last updated: June 4, 2026, 7:53 pm 7:53 pm
Srinivas Kolluri
Share
Congress Show Cause Notice

అక్షరటుడే, కామారెడ్డి : Congress Show Cause Notice | పీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి గురువారం కాంగ్రెస్​ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు కమిటీ ఛైర్మన్ మల్లు రవి (Mallu Ravi), వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ అనంతుల నోటీసులు అందజేశారు.

కామారెడ్డి (Kamareddy) జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి చంద్రశేఖర్​రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ (Disciplinary Committee)కి ఫిర్యాదులు అందాయని, బహిరంగ సభల్లో పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేశారని పత్రికల్లో వార్తలు వచ్చాయని నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా పలు క్రిమినల్ కేసుల్లో చంద్రశేఖర్ రెడ్డికి ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయని, ఒక సీనియర్ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ప్రతిష్టకు, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించారని కమిటీ తెలిపింది. ఈ ఆరోపణలపై 7 రోజుల్లో అంటే 11 జూన్ లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేశారు.

Congress Show Cause Notice | వివరణ అనంతరం..

ఇటీవల జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతోనే ఈ నోటీసు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల చంద్రశేఖర్​ రెడ్డి మాట్లాడుతూ.. షబ్బీర్​ అలీని ఉద్దేశించి నక్క అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన అనుచరులు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇచ్చే వివరణను పరిశీలించిన తర్వాత కమిటీ తదుపరి చర్యలు తీసుకోనుంది.

Congress Show Cause Notice | సస్పెండ్​ చేయాలి

కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. క్రమశిక్షణ కమిటీ తీసుకున్న ఈ చర్యను తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, విలువలు, సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడానికి క్రమశిక్షణ అత్యంత అవసరమని పేర్కొన్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని ఎంత తొందరగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, అంత తొందరగా పార్టీని కాపాడిన వాళ్లమవుతామని తెలిపారు. ఆయనపై చేసిన ప్రతి ఆరోపణకు ఆధారాలు ఉన్నాయని, సస్పెన్షన్ నుంచి తప్పించుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.

దీనిని కూడా చదవండి : Congress Infighting | గ్రూప్ తగాదాలకు ఆజ్యం పోస్తున్న షబ్బీర్.. గడ్డం చంద్రశేఖర్​ రెడ్డి వర్గం ఆరోపణ..

TAGGED:Congress Discipline CommitteeCongress Show Cause Noticegaddam chandrasekhar reddyKamareddy politicsPCC General SecretaryShabbir AliTelangana Congresstelangana political news
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article MLA Dhanpal | MLA Dhanpal | కాంగ్రెస్​ను ఎదుర్కొనే దమ్ములేక నాపై ఆరోపణలు: ఎమ్మెల్యే ధన్​పాల్​
Next Article Basketball Team | Basketball Team | రాష్ట్రస్థాయి బాస్కెట్​బాల్ పోటీలకు జిల్లా జట్టు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Vemula Prashanth Reddy |
నిజామాబాద్

Vemula Prashanth Reddy | రేవంత్ రెడ్డి ఒక ‘ఫెయిల్యూర్ సీఎం’..: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

By Shashi kiran Mottala
Lingampet Police |
నిజామాబాద్

Dumping Yard | డంపింగ్ యార్డు వద్ద వ్యక్తి ఆత్మహత్య

By Shashi kiran Mottala
Tractor Tyre Blast |
క్రైంనిజామాబాద్

Tractor Tyre Blast | ట్రాక్టర్ టైర్​ పేలి​.. నలుగురికి గాయాలు

By Shashi kiran Mottala
Bakrid Celebrations
నల్గొండ

Bakrid Celebrations | ముస్లింల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కోమటిరెడ్డి

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.