అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Premier League | నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ(cricket tournament) ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతోంది. స్థానిక ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్లో (Womens College Ground) రెండోరోజు మంగళవారం లీగ్ పోటీలు నిర్వహించారు.
Nizamabad Premier League | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో..
ఈ సందర్భంగా గ్రౌండ్లో నాలుగు మ్యాచ్లు జరిగాయి. పోటీల సందర్భంగా సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) మాట్లాడుతూ.. యువత పెడదారిన పడకుండా ఉండేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అలాగే యువత తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. రెండోరోజు గజానన్ టీం, గుండారం టీం తలపడగా.. గజానన్ టీం విజయం సాధించింది. వేల్పూర్, ముప్కాల్ జట్లు పోరాడగా.. వేల్పూర్ పీఎస్ జట్టు గెలిచింది.
అలాగే ఛత్రపతి శివాజీ, అమ్దాపూర్ జట్లు తలపడగా.. ఛత్రపతి శివాజీ జట్టు విజయకేతనం ఎగురవేసింది. మోహన్ ఎలెవన్, వర్ని వారియర్స్ జట్ల మధ్య పోటీ జరగగా.. వర్ని వారియర్స్ వాకోవర్ చేయగా.. మోహన్ ఎలెవన్ జట్టు విజేతగా ప్రకటించారు.
కార్యక్రమంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (Nizamabad Security Council) ఛైర్మన్ సీపీ సాయిచైతన్య, జనరల్ సెక్రెటరీ డాక్టర్ కవితా రెడ్డి, ట్రెజరర్ సంతోష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ కాకతీయ విద్యాసంస్థల (Kakatiya Educational Institutions) అధినేత రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Baswareddy Farewell | అడిషనల్ డీసీపీ బస్వారెడ్డికి ఘనంగా వీడ్కోలు..


