నిజామాబాద్RTC Strike | కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలమన్న మంత్రి పొన్నo.. ఆర్టీసీ జేఏసీ సమ్మెకు...

RTC Strike | కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలమన్న మంత్రి పొన్నo.. ఆర్టీసీ జేఏసీ సమ్మెకు కవిత మద్దతు!

అక్షరటుడే, ఆర్మూర్: RTC Strike | కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు (మంగళవారం) అర్ధరాత్రి నుంచి ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. దీంతో నిజామాబాద్ జిల్లా రీజినల్ పరిధిలోని ఆరు డిపోల (నిజామాబాద్ -1, నిజామాబాద్ -2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ) బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి.

RTC Strike | ప్రభుత్వం వెనుకడుగు…

Tg RTC ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో చాలా అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయడం, యూనియన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. కానీ తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని ఆర్టీసీ జేఏసీ నేతలు దృఢ సంకల్పంతో ఉన్నారు.akshara today .jpgRTC

RTC Strike | ప్రయాణికుల్లో ఆందోళన..

అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్ కానుండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ రీజినల్ లోని ఆరు డిపోల పరిధిలో 700 బస్సులు నిత్యం 3,200 ట్రిప్పులు తిరుగుతాయి.

ఈ లెక్కన సుమారు రోజుకు రూ. 68 – 75 లక్షల వరకు నష్టం కలగనుంది. ఆర్టీసీ సమ్మెతో మరోవైపు పార్సిల్స్, కొరియర్ సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి.

 

RTC Strike | ప్రభుత్వం సానుకూలంగా ఉంది..

Untitled 1.jpg ponnam

ఆర్టీసీ కార్మికుల డిమాండ్​లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ఉద్యోగులు బాధ్యతగా ఉండాలని సూచించారు.

సమ్మెకు సంపూర్ణ మద్దతు..

Kavitha

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Telangana | చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...