సినిమాChitti Babu Death | టాలీవుడ్‌లో తీవ్ర‌ విషాదం: నటుడు, నిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు...

Chitti Babu Death | టాలీవుడ్‌లో తీవ్ర‌ విషాదం: నటుడు, నిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత, సినీ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు హఠాత్తుగా కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chitti Babu Death| తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu Film Industry)లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత, సినీ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు (56) మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి వార్త సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

మంగళవారం రాత్రి ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు (Cardiac Arrest) రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌ (Hyderabad) కొండాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆయ‌న మృతి ప‌ట్ల చిత్ర ప‌రిశ్ర‌మ సంతాపం వ్య‌క్తం చేసింది. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్ర‌ముఖులు ప్రార్ధిస్తున్నారు..

Chitti Babu Death | వ్యక్తిగత జీవితం

చిట్టిబాబు అసలు పేరు త్రిపురనేని వరప్రసాద్. 1970 జనవరి 1న కృష్ణా జిల్లా కాజ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు త్రిపురనేని మహారథి మరియు హేమలత. భార్య, ఇద్దరు కుమారులు ఆయనకు ఉన్నారు. చిట్టిబాబు తండ్రి త్రిపురనేని మహారథి తెలుగు సినీ రంగంలో గొప్ప రచయితగా  పేరు పొందారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రక చిత్రాలకు అందించిన సంభాషణలు చిరస్మరణీయంగా నిలిచాయి. తండ్రి నుంచి వచ్చిన సాహిత్యాభిరుచి, సినీ పట్ల ఆసక్తిని చిట్టిబాబు కొనసాగించారు.

Chitti Babu Death | గంభీరమైన పాత్రలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు

చిట్టిబాబు తన కెరీర్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా వందలాది చిత్రాల్లో నటించారు. కేవలం హాస్య పాత్రలకే పరిమితం కాకుండా, భావోద్వేగపూరితమైన, గంభీరమైన పాత్రలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.సినిమా నిర్మాణంపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారి పలు చిత్రాలను నిర్మించారు. పరిశ్రమలోని నిర్మాణ వ్యయాలు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, మార్కెట్ ట్రెండ్స్‌పై లోతైన అవగాహన కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇటీవలి కాలంలో చిట్టిబాబు సినీ విశ్లేషకుడిగా టీవీ డిబేట్స్‌లో, మీడియా చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు. సినిమాల విజయావకాశాలు, పరిశ్రమలో మారుతున్న ధోరణులు, సమస్యలపై ఆయన స్పష్టమైన, నిర్మొహమాట వ్యాఖ్యలు చేసేవారు. ఆయన విశ్లేషణలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయని సినీ వర్గాలు అభిప్రాయపడేవి. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) సహా పలు సినీ యూనియన్లలో ఆయన చురుకుగా వ్యవహరించారు. తోటి కళాకారుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండేవారు. ఈ రోజు సాయంత్రం హైద‌రాబాద్‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ఇది కూడా చదవండి..: Upasana Konidela | పాశ్చాత్యం వద్దు.. భారతీయ సంప్రదాయమే ముద్దు.. టాయిలెట్ వినియోగంపై ఉపాసన ప్రచారం!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...