Vaikunthanath Behera Assets | రూ.6 వేల జీతంతో ఉద్యోగం ప్రారంభం.. రూ.వందల కోట్ల ఆస్తులు

ఒడిశాలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ ఇంట్లో విజిలెన్స్​ అధికారులు దాడులు చేశారు. రూ.వందల కోట్ల అక్రమాస్తులను గుర్తించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vaikunthanath Behera Assets | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. లంచాలు తీసుకోని భారీగా అక్రమాస్తులు కూడబెడుతున్నారు. ఇటీవల ఏ అవినీతి అధికారి ఇంట్లో దాడులు చేసినా రూ.వందల కోట్ల అక్రమాస్తులు వెలుగు చూస్తున్నాయి.

తాజాగా ఒడిశా (Odisha)లో ఓ అవినీతి అధికారి ఇంట్లో విజిలెన్స్​ అధికారులు దాడులు చేశారు. రూ.6 వేల జీతంతో జూనియర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించిన వైకుంఠనాథ్ బెహెరా.. అనంతరం వందల కోట్లు కూడబెట్టాడు. 25 ఏళ్ల సర్వీసు ముగిసే సమయానికి భారీగా అక్రమాస్తులు సంపాదించడంతో అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో దాడులు చేపట్టగా.. తనిఖీల్లో నోట్ల కట్టలు బయట పడ్డాయి. అతడి అక్రమాస్తులు చూసి అధికారులే షాక్​ అయ్యారు.

Vaikunthanath Behera Assets | రూ.2 కోట్ల నగదు స్వాధీనం

తనిఖీల్లో భాగంగా రూ.2 కోట్లకు పైగా నగదు, 341 గ్రాముల బంగారం, రూ.45 లక్షల డిపాజిట్ స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో 5 భవనాలు, 14 ఖరీదైన ఫ్లాట్లు అతని పేరిట ఉన్నట్టు గుర్తించారు. అవినీతికి పాల్పడి ఇంత భారీ మొత్తాన్ని వైకుంఠనాథ్ కూడబెట్టాడని విజిలెన్స్ ఆఫీసర్లు తేల్చారు. ఆయన బాలిగూడలోని ఐటీడీఏ (ITDA)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

 

దీనిని కూడా చదవండి : Surat Gas Leak | జ్యువెలరీ ఫ్యాక్టరీలో విషవాయువు లీక్.. ట్యాంక్ క్లీన్ చేస్తూ నలుగురు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *