HCA President Verdict | హెచ్‌సీఏ అధ్యక్షుడి ఎన్నిక రద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా అమర్‌నాథ్ ఎన్నికను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: HCA President Verdict | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా అమర్‌నాథ్ ఎన్నికను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని ఆదేశించింది. అసోసియేషన్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా.. వెంటనే ప్రత్యేక ఏజీఎం (Special AGM) సమావేశాన్ని ఏర్పాటు చేసి, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

HCA President Verdict | కేసు నేపథ్యం ..

గతంలో జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో జగన్‌మోహన్ రావు చేతిలో అమర్‌నాథ్ కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే, జగన్‌మోహన్ రావు సమర్పించిన ‘శ్రీ చక్ర క్లబ్’ పత్రాలు నకిలీవని, ఆ క్లబ్‌కు అసలు గుర్తింపే లేదంటూ అమర్‌నాథ్ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

HCA President Verdict | సుదీర్ఘంగా వాదనలు ..

అమర్‌నాథ్ ఫిర్యాదును పరిశీలించిన జస్టిస్ కైత్.. హెచ్‌సీఏ పనులు ఆగిపోకూడదనే ఉద్దేశంతో రన్నరప్‌గా నిలిచిన అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం.. తాజాగా అమర్‌నాథ్ ఎన్నిక చెల్లదంటూ తుది తీర్పును వెలువరించింది.

ఇది కూడా చదవండి:  Delhi Airport Marijuana Seizure | గీజర్​లో గంజాయి రవాణా.. పట్టుకున్న కస్టమ్స్​ అధికారులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *