అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: E Sakshya | పోలీస్ వ్యవస్థలను(Police Digitalization) డిజిటలైజేషన్ చేయడమే ‘ఈ–సాక్ష్య’ ప్రధాన లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) పేర్కొన్నారు. సీసీటీఎంఎస్ 2.0, ‘ఈ సాక్ష్య’ అమలుపై అన్ని జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
E Sakshya | నేర సమాచారానికి సాంకేతికత జోడించి..
సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించేందుకు పోలీస్‌శాఖ(Telangana Police) ముందడుగు వేస్తుందన్నారు. ఈ క్రమంలో సీసీటీఎన్ఎస్ 2.0 ద్వారా నేరాలు, నేరస్థుల సమాచారాన్ని వేగవంతంగా నమోదు చేయడం, దర్యాప్తు ప్రక్రియను డిజిటలైజ్ చేయడాన్ని అలవాటుగా చేసుకోవాలన్నారు. ప్రజలకు అందించే సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంపై డీజీపీ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో (Telanagana) ఈ-సాక్ష్య వ్యవస్థ ద్వారా నేర సంఘటనలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను సేకరించడం(Crime Investigation), భద్రపరచడం, కోర్టు విచారణల్లో సమర్పించే విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.
సంబంధిత అధికారులు ఈ వ్యవస్థల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండి , క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. వీసీలో జిల్లా నుండి అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మల్లేష్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, పీసీఆర్ ఇన్స్పెక్టర్ వీరయ్య, సీఐలు, ఎస్సైలు ఐటీ కోర్ సిబ్బంది, స్టేషన్ రైటర్స్, స్టేషన్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
