అక్షరటుడే, వెబ్డెస్క్ : Employee Salaries | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు చెల్లించాలని సూచించారు.
ప్రస్తుతం కొంతమంది ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీన అందడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీతాల చెల్లింపులలో జాప్యంలో ఇంటి ఖర్చులు, లోన్లు, ఈఎంఐల కోసం బయట అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అందరు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడాలని ఆదేశింంచారు.
Employee Salaries | జాప్యంపై ఆగ్రహం

బిల్లుల ఆలస్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలకు సంబంధించిన బిల్లులను ప్రతి నెల 25లోపు బిల్లులను ట్రెజరీకి సమర్పించాలని మార్గదర్శకాలు జారీ చేశారు. ఒకటో తేదీన జీతాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏ శాఖలో వేతనాలు ఆలస్యంగా జమ అయితే సంబంధిత శాఖ హెచ్వోడీ, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. సకాలంలో బిల్లులు రికార్డు చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Hyderabad traffic jam | భాగ్యనగరంలో ‘ట్రాఫిక్’ నరకం: గంటల తరబడి స్తంభించిన ఐటీ కారిడార్.. నగరవాసుల విలవిల!
