అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gandhi hospital | నిజామాబాద్ జీజీహెచ్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా పనిచేసిన బీవీ నాగమోహన్‌రావు గాంధీకి ఆస్పత్రికి బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన బుధవారం సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ముందుకు ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. డాక్టర్ నాగమోహన్ రావు 2016 నుంచి నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా సేవలందిస్తూ విభాగ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు.
Gandhi hospital | నిజామాబాద్ జీజీహెచ్‌లో కీలక బాధ్యతలు
నిజామాబాద్ నగరంలోని మెడికల్ కళాశాలలో నాగమోహన్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. కాగా.. కొన్ని నెలల క్రితం ప్రభుత్వం ఆయనకు జీజీహెచ్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఆస్పత్రిని గాడిన పెట్టేందుకు ప్రణాళికతో పనిచేశారు. కాగా.. ఆయనను గాంధీ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా బదిలీ చేస్తూ డీఎంఈ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి..: Medical College Transfers | మెడికల్ కళాశాలలో భారీగా బదిలీలు
