Bada Ram Mandir | ముగిసిన బడారాంమందిర్​ ఆలయ భూముల కౌలు ప్రక్రియ

నగరంలోని గాజుల్​పేట్​ బడా రాంమందిర్​కు చెందిన భూముల కౌలు ప్రక్రియను బుధవారం కంజర జీపీలో పూర్తి చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Bada Ram Mandir | నగరంలోని (Nizamaba6d City) గాజుల్​పేట్​ బడా రాంమందిర్​కు చెందిన భూముల (Temple Land) కౌలు ప్రక్రియను బుధవారం కంజర జీపీలో పూర్తి చేశారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.

Bada Ram Mandir | రెండేళ్ల కాలపరిమితికి..

ఆలయానికి చెందిన భూములు మోపాల్(Mopal)​ మండలంలోని కంజరలో 14ఎకరాల 13 గుంటలు ఉండగా బుధవారం ఆ భూముల్లో సాగు కోసం కౌలు ప్రక్రియ నిర్వహించారు. వీటిని రెండేళ్ల కాల పరిమితికి గాను రామర్తి సమత రూ. 17,51,000కు పాటపడి కౌలుకు దక్కించుకున్నారు. జిల్లా దేవాదాయ-ధర్మాదాయ శాఖ (Endowments Department) సహాయ కమిషనర్ విజయ రామారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడా రాంమందిర్​ మఠం ఫిట్​ పర్సన్​ వేణు, తహశీల్దార్​ సుజాత రెడ్డి, ఆయా ఆలయాల జూనియర్​ అసిస్టెంట్లు ఆంజనేయులు, ప్రశాంత్​కుమార్​, రఘునాథ్​, సుమన్​ తదితరులు ఉన్నారు.

venu venu33

ఇది కూడా చదవండి: TCS Market Value | క్షీణిస్తున్న టీసీఎస్ విలువ.. 21 నెలల్లో సగమైన మార్కెట్ క్యాప్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *