అక్షరటుడే, వెబ్డెస్క్: Kavitha Comments | రాష్ట్రంలో నిత్యం బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం మొద్దునిద్ర వీడటం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె వీడియో విడుదల చేశారు.
రోజుకు ఐదు పోక్సో కేసులు నమోదు అవుతున్నాయంటే హోంమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పూర్తిగా విఫలమయ్యారని కవిత విమర్శించారు. ఇప్పటికైనా సీఎం మొద్దునిద్ర వీడి మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Kavitha Comments | పెద్ద స్టేట్మెంట్లు
సీఎం రేవంత్రెడ్డి పక్క రాష్ట్రాలకు వెళ్లి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారని కవిత అన్నారు. ‘నేను హిట్లర్ను.. మార్పు తెచ్చేస్తా’ అని సీఎం అంటున్నారని ఆమె పేర్కొన్నారు. హైడ్రా పెట్టి పేదల ఇళ్లు కూలగొట్టానని గర్వంగా చెబుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి నాయకులను తెలంగాణ ఇంతవరకు చూడలేదన్నారు.
Kavitha Comments | రేవంత్రెడ్డి అట్టర్ ప్లాఫ్

చిన్నారులపై నేరాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఓ చిన్నారిని నాలుగో ఫ్లోర్ నుంచి తోసి చంపే యత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలే దారుణాలు జరుగుతున్నాయంటే హోంశాఖ చూస్తున్న రేవంత్రెడ్డి అట్టర్ ప్లాఫ్ అయ్యారని విమర్శించారు. మహిళలపై నేరాల్లో సౌత్ ఇండియాలో తెలంగాణ టాప్లో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటన్నారు. మహిళలు, చిన్నారులపై హింసను నివారించేందుకు సీఎం చర్యలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణగా టీఆర్ఎస్ ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి..: Jupally Krishna Rao | గంజాయి రవాణాపై కఠిన చర్యలు : మంత్రి జూపల్లి
