Revanth Reddy Modi Meeting | ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్​రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి గురువారం ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్ర అభివృద్ధి సహకరించాలని ఆయనను కోరారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Modi Meeting | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) గురువారం ప్రధాని మోదీ (PM Modi)ని కలిశారు. రాష్ట్ర అభివృద్ధి సహకరించాలని ఆయనను కోరారు. ఈ మేరకు పలు ప్రతిపాదనలు సమర్పించారు.

నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశంలో పాల్గొనడానికి సీఎం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్​ అనంతరం ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, పలు ప్రాజెక్ట్​లకు కేంద్ర అనుమతులపై చర్చించారు. మెట్రో ఫేజ్​–2, మూసీ ప్రక్షాళనపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆయన మోదీకి వినతిపత్రం సమర్పించారు.

Revanth Reddy Modi Meeting | కీలక ప్రతిపాదనలు

pm modi 1

నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో సీఎం కేంద్రం ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. మెట్రో ఫేజ్-2 (Metro Phase -2), రీజినల్ రింగ్ రోడ్ (RRR), భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, బందరు పోర్టు కనెక్టివిటీ, సెమీకండక్టర్ పెట్టుబడులు, IIM హైదరాబాద్ వంటి కీలక ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ నగరాల అభివృద్ధి కోసం రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు.

దీనిని కూడా చదవండి : Khammam Theft | ఖమ్మంలో భారీ చోరీ.. రూ.2 కోట్ల విలువైన ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *