Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - అంతర్జాతీయం

అంతర్జాతీయం

 Iran US Peace Deal | ఇరాన్​తో యుద్ధం ముగిసింది.. ట్రంప్​ సంచలన ప్రకటన

ఇరాన్‌పై దాడులు విరమించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు పూర్తయ్యాయని తెలిపారు.

Srinivas Kolluri
Last updated: June 12, 2026, 11:48 am 11:48 am
Srinivas Kolluri
Share
Iran US Peace Deal

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran US Peace Deal | ఇరాన్‌పై దాడులు విరమించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు పూర్తయ్యాయని, పీస్ డీల్‌కు పలు దేశాలు ఆమోదం తెలిపాయని వెల్లడించారు.

ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెనక్కి తగ్గారు. గురువారం రాత్రి పెద్ద ఎత్తున దాడులు చేస్తామని, భవిష్యత్​లో ఖర్గ్​ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్​ సోషల్​ మీడియాలో పోస్ట్​లో పేర్కొన్న విషయం తెలిసిందే. గతంలో సైతం ఇలాగే ట్రంప్​ బెదిరింపులకు పాల్పడి అర్ధరాత్రి కాల్పుల విరమణకు ఆమోదం తెలిపారు. తాజాగా మరోసారి దాడులు చేస్తామని హెచ్చరించి.. వెనక్కి తగ్గారు.

Iran US Peace Deal | త్వరలో సంతకాలు

ఇరాన్‌ (Iran)తో యుద్ధాన్ని ముగించే ఒప్పందం దాదాపుగా పూర్తయిందని ట్రంప్​ తెలిపారు. ఈ వారాంతంలోనే యూరప్‌లో దీనిపై సంతకాలు జరగవచ్చని పేర్కొన్నారు. ప్రతిపాదిత ఒప్పందంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని టెహ్రాన్ హెచ్చరించింది. గురువారం (యూఎస్​ కాలమానం ప్రకారం) ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్​ విలేకరులతో మాట్లాడుతూ, పత్రాలు తుది దశలో ఉన్నాయని, అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ సంతకాల కార్యక్రమానికి హాజరుకావచ్చని ట్రంప్ తెలిపారు.

Iran US Peace Deal | అణ్వాయుధాలపై..

చర్చలు పురోగమిస్తున్న తరుణంలో, తాను ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, పాకిస్తాన్ నాయకులతో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఈ రోజు మేము ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాం. మేము పట్టుబట్టినట్లుగా, వారు ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని అంగీకరించారు. మా ముఖ్య ఉద్దేశం అదే అని ట్రంప్ అన్నారు. అమెరికా దాడుల్లో ఇరాన్​ తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. దీంతో ఈ ఒప్పందం చేసుకోవడానికి వారు ముందుకు వచ్చారని ఆయన జోడించారు. ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు పూర్తయిన తర్వాత హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని ట్రంప్ చెప్పారు. అయితే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. ఒప్పందంలోని చాలా భాగం ఖరారైనప్పటికీ, కీలక నిర్ణయాలు ఇంకా సమీక్షలో ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ చెప్పినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.

#WATCH | When asked whether Iran committed to not pursuing a nuclear weapon after the finalisation of deal, US President Donald Trump says, “They will not have a nuclear weapon. They’ve agreed to that… They will not purchase, develop in any way any shape or in any way, form a… pic.twitter.com/Kq8FwEoBd9

— ANI (@ANI) June 11, 2026

ఇది కూడా చదవండి..: Oman Ship Attack | ఒమన్ తీరంలో నౌకపై అమెరికా దాడి: విశాఖకు చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ దుర్మరణం

TAGGED:Donald Trumpglobal politicsinternational newsiran newsIran US Peace DealMiddle East NewsPeace AgreementUS Iran relations
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Raghava Lawrence Politics Raghava Lawrence Politics | రాఘవ లారెన్స్ ‘పొలిటికల్’ ఎంట్రీ.. ప్రజల నిర్ణయమే కీలకం
Next Article Nizamabad Cycling Competition Nizamabad Cycling Competition | 13న జిల్లాస్థాయి సైక్లింగ్​ పోటీలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Hantavirus WHO Alert
అంతర్జాతీయం

Hantavirus WHO Alert | కొవిడ్​ను మించిన వైరస్.. ప్రపంచ దేశాలను అలర్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

By Naresh Chandan
Iran America Talks
అంతర్జాతీయం

Iran America Talks | పాకిస్థాన్‌‌కు ఇరాన్ మంత్రి.. యుద్ధానికి బ్రేక్ పడేనా?

By Srinivas Kolluri
Drone Attack
అంతర్జాతీయం

Drone Attack | యూఏఈలోని అణువిద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్​ దాడి

By Srinivas Kolluri
US Green Card Rules
అంతర్జాతీయం

US Green Card Rules | గ్రీన్‌కార్డు కావాలా?.. అయితే స్వదేశానికి వెళ్లండి! తాత్కాలిక వలసదారులకు యూఎస్‌సీఐఎస్ స్పష్టీకరణ

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.