భీమ్‌గల్, అక్షరటుడే: Bheemgal Ganja Seizure | మండల పరిధిలో గంజాయి విక్రయాలు, వినియోగంపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం గట్టి నిఘా పెట్టింది. భీమ్‌గల్ మండలం (Bheemgal Mandal) సంతోష్‌నగర్ తండా సమీపంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది.
Bheemgal Ganja Seizure | ముగ్గురు వ్యక్తులను..
ఈ తనిఖీల్లో భీమ్‌గల్‌కు చెందిన షేక్ మజాస్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 100 గ్రాముల ఎండు గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను ఎక్సైజ్ అధికారులు (Excise Officers) స్వాధీనం చేసుకున్నారు. మండలంలో గంజాయి తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్న మరో ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ బృందం గుర్తించింది. అనంతరం వారిని, వారి తల్లిదండ్రులను ఎక్సైజ్ కార్యాలయానికి పిలిపించారు. తల్లిదండ్రుల సమక్షంలోనే గంజాయి సేవించడం వల్ల కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాల గురించి, చట్టపరమైన ఇబ్బందుల గురించి వారికి క్షుణ్ణంగా అవగాహన కల్పించి హెచ్చరించారు.

ఆ తర్వాత భవిష్యత్తులో ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉంటామనే నిబంధనపై భీమ్‌గల్ తహశీల్దార్ ఎదుట ఆ ముగ్గురు వ్యక్తులను బైండోవర్ చేసినట్లు భీమ్‌గల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పి.వేణుమాధవ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో గంజాయి తదితర మత్తు పదార్థాల విక్రయదారులపై, వినియోగదారులపై నిరంతరం నిఘా ఉంటుందని, చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో అబ్కారీ శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Shepherd Road Accident | డీసీఎం వ్యాన్ ఢీకొని మేకల కాపరి మృతి
