అక్షరటుడే, వెబ్డెస్క్ : Kavitha Criticism | కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్న గుండె ధైర్యం లేని పరిస్థితి కనిపిస్తోందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఉద్యమకారుల విషయమైన ఉద్యోగుల విషయమైన సరే కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ప్రభుత్వం 317 జీవోపై వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఆ జీవోను సవరిస్తూ మధ్యంతరంగా 190 జీవోను తెచ్చిందని కవిత గుర్తు చేశారు. తొమ్మిది నెలలు గడిచిన సరే ఇప్పటి వరకు కూడా ఆ జీవోను అమలు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 317 జీవో బాధితుల్లో ఎక్కువగా టీచర్లతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. వారిని స్వస్థలాకు పంపిస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందన్నారు.
Kavitha Criticism | బదిలీలు చేయాలి
జీవో గడువు మూడేళ్లు మాత్రమే ఉంటే ఇప్పటి వరకు ఒక్కరినీ కూడా బదిలీ చేయలేదని కవిత అన్నారు. జీవో 25 రేషనలైజేషన్ తో సంబంధం లేకుండా 190 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలన్నారు. ఉద్యోగులు, టీచర్ల హక్కుల కోసం వారి తరఫున పోరాడుతామని పేర్కొన్నారు. ఉద్యోగులను బదిలీ చేయకుండా పైరవీల కోసం ప్రభుత్వం ఆగుతుందన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయంలో పోరాడాలన్నారు. తాము ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 317 జీవోల బాధితులను తక్షణమే బదిలీ చేయాలన్నారు.
ఇది కూడా చదవండి..: Loan Money Fraud | కొత్తూరులో సైబర్ మోసం.. రూ. 16.78 లక్షలు మాయం
