అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Narayana College | నగరంలో నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు విక్రయిస్తున్న ఆరోపణపై నారాయణ కళాశాలను సీజ్ చేశారని ఏబీవీపీ( abvp protest ) నాయకులు పేర్కొన్నారు. కళాశాలను శుక్రవారం సందర్శించిన డీఐఈవో (DIEO Ravi kumar) రవికుమార్ పుస్తక విక్రయాలను గుర్తించి సీజ్ చేశారన్నారు.
Narayana College | పుస్తకాలు.. యూనిఫార్మ్‌లు అధిక రేట్లకు…
ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ నారాయణ కళాశాలలో( Intermediate Education ) యూనిఫార్మ్స్, బుక్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అదే విధంగా కళాశాల బిల్డింగ్‌కు పర్మిషన్ లేకున్నా కళాశాల నడుపుతున్నారన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరిట తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్న నారాయణ కళాశాల గదిని, కళాశాలను డీఐఈవో సీజ్ చేశారన్నారు.
జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అలాంటి కాలేజీలు, బడులపై చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా కన్వీనర్ మందపల్లి అక్షయ్, సమీర్, దుర్గా దాస్, సిద్దు, మున్నా, ప్రణీత్ తేజ, శివ, టిల్లు, సన్నీ, అశ్విత్, విగ్నేష్, చరణ్, మనోహర్,తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Ponguleti Srinivasa Reddy | ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
