Shabbir Ali Notice | కాంగ్రెస్‌లో కలకలం.. సీనియర్ నేత షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు

కామారెడ్డి కాంగ్రెస్​ పార్టీలో కలకలం రేగింది. తాజాగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే ఆరోపణలపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీకి టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Shabbir Ali Notice | కామారెడ్డి కాంగ్రెస్​ పార్టీలో (kamareddy politics) కలకలం రేగింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే ఆరోపణలపై సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీకి టీపీసీసీ(TPCC notice) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్ (bomma mahesh kumar goud)​ శనివారం ప్రకటన విడుదల చేశారు.

Shabbir Ali Notice | మహిళా ప్రతినిధిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో..

ఇటీవల షబ్బీర్ అలీపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఓ మహిళా నాయకురాలిని ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు వివరణ కోరుతూ షోకాజ్​ నోటీసులు ఇచ్చింది. కొన్ని రోజులుగా సదరు సీనియర్​నేత చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మహిళా నేత పట్ల ఆయన వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలు సరికావని పార్టీ అంతర్గత సంభాషణల్లోనే కాకుండా, బహిరంగంగానూ విమర్శలు వచ్చాయి.

Shabbir Ali Notice | గతంలో ​చంద్రశేఖర్‌రెడ్డికి కూడా నోటీసులు!

​గతంలో షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై బహిరంగంగా స్పందించి.. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డికి కూడా పీసీసీ షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన శుక్రవారం క్రమశిక్షణ కమిటీ ముందు తన వివరణ కూడా ఇచ్చుకున్నారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందుకు తీసుకెళ్లడం, తోటి నాయకుడిపై బహిరంగ విమర్శలు చేయడం కూడా క్రమశిక్షణా రాహిత్యమేనని భావించిన అధిష్టానం ఆయనకు గతంలో నోటీసులిచ్చింది.

Shabbir Ali Notice | పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదు..

​ఈ షోకాజ్​ నోటీసులపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ లైన్​ దాటితే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకునేది లేదన్నారు. పార్టీలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో కాంగ్రెస్​పార్టీ ముందుంటుందన్నారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఎవరైనా మహిళల పట్ల చులకనగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా షబ్బీర్​అలీకి సైతం నోటీసులు జారీకావడంతో ఈ వివాదం ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందోననే చర్చ కామారెడ్డిలో జరుగుతోంది.

kamareddy 1

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *