House Fire Nizamabad | కార్పొరేటర్​ ఇంట్లో షార్ట్​ సర్క్యూట్​.. తప్పిన ముప్పు..

బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ ​క్రైం: House Fire Nizamabad | బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. నగరంలోని(Nizamabad) ఎల్లమ్మగుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది.

House Fire Nizamabad | ఎల్లమ్మగుట్టలో..

నగరంలోని 45 డివిజన్ కార్పొరేటర్ సుమిత్ర వేణుగోపాల్​ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు లేచాయి. అయితే ఆ సమయంలో కార్పొరేటర్ సుమిత్ర ఇంట్లో లేరు. ఇంట్లోని పైఅంతస్తులో ఆమె భర్త వేణుగోపాల్ ఉండగా వెంటనే అగ్ని ప్రమాదాన్ని గమనించిన ఆయన ఫైర్ స్టేషన్ సిబ్బందికి(Fire Department) సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పి వేశారు. ఈ మేరకు నాల్గో టౌన్ పోలీసులు సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ(MLA Dhanpal Suryanarayana) ఆదివారం కార్పొరేటర్ ఇంటికి వెళ్లారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్నారు.

illu1

ఇది కూడా చదవండి: Penthouse Shed Collapse | పెంట్​ హౌజ్​పై నుంచి పడిన రేకులు.. ఒకరికి తీవ్ర గాయాలు

 

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *