అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao Remarks | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తనకు హిట్లర్ ఆదర్శం అంటున్నారని, ఆయనకు పట్టిన గతే రేవంత్‌కు కూడా పడుతుందని హరీశ్‌రావు అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
ఇటీవల సీఎం మాట్లాడుతూ.. తాను హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా (Hydraa) ఏర్పాటు చేశానని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై హరీశ్‌రావు స్పందిస్తూ.. హిట్లర్ చేసిన దుర్మార్గాలకు జర్మనీ ప్రపంచానికి ఇప్పటికీ క్షమాపణ చెప్తుందన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్తూనే ఉండాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా అని ఇండ్లు కూల్చుతుంటే వరంగల్‌లో గుడిసెలు కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నియంతకు పట్టిన గతే ఈ నియంతలకు పడుతుందని పేర్కొన్నారు.
Harish Rao Remarks | సింగరేణిలో స్కామ్

బూట్లు, చెప్పులు, సింగరేణి (Singareni) బొగ్గులోనూ స్కాం చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. గనులను చూస్తామంటే తమను వెళ్లనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా అక్కడ బొగ్గు ఉంటే తాను క్షమాపణ చెబుతానన్నారు. గనులు లేకపోతే రాజీనామా చేస్తారా అని భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో కుంభకోణం చేస్తుంది విచారణ జరిపించండి అని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి తాను చెప్పానని హరీశ్‌రావు అన్నారు. అయితే కుంభకోణం జరిగిందట విచారణ చేసుకో అని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి లేఖ రాశారన్నారు. దొంగనే దొంగ మీద విచారణ చేసుకుంటాడా అని ఎద్దేవా చేశారు.
Harish Rao Remarks | ఫ్రంట్ పేజీల్లో యాడ్లు..
బీఆర్ఎస్ (BRS) హయాంలో 2021లో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రస్తుతం 75 లక్షల మెట్రిక్ టన్నులు కొని.. ఏదో గొప్ప పని లెక్క ఫ్రంట్ పేజీల్లో యాడ్స్ వేయిస్తోందని విమర్శించారు. కార్యకర్తల కష్టంతోనే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అద్భుతంగా పని చేస్తుందని ఆయన కొనియాడారు.
హిట్లర్ ఆదర్శం అంటే హిట్లర్‌కు పట్టిన గతే పడుతుంది.!
• బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, హరీష్ రావు pic.twitter.com/aD3fIRddV5
— Telugu Reporter (@TeluguReporter_) June 14, 2026
దీనిని కూడా చదవండి : Kishan Reddy Challenge | నన్ను అడ్డుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా?: కిషన్ రెడ్డి