తెలంగాణKTR Attack Congress | తెలంగాణకు శని కాంగ్రెస్​ : కేటీఆర్​

KTR Attack Congress | తెలంగాణకు శని కాంగ్రెస్​ : కేటీఆర్​

తెలంగాణకు కాంగ్రెస్​ శని అని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Attack Congress | తెలంగాణకు కాంగ్రెస్​ శని అని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. కాళేశ్వరం కమిషన్​ రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్​, హరీశ్​రావుపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు (High Court) తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ భవన్​లో కేటీఆర్​ మీడియాతో మాట్లాడారు.

కక్ష కట్టినట్టుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం (Kaleshwaram)పై చిల్లర ప్రచారం చేసిందని కేటీఆర్​ మండిపడ్డారు. కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్‌పై చేసిన కుట్రలు అన్నారు. తమపై బురదచల్లారని, కానీ నిప్పులాంటి నిజం బయటకు వచ్చిందన్నారు. కాళేశ్వరం మహత్యాన్ని కనబడకుండా దాచలేరని చెప్పారు. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు అన్నారు.

KTR Attack Congress | పీసీసీ రిపోర్టు

ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా.. తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి చుక్క కేసీఆర్‌ ఇచ్చిందే అని కేటీఆర్​ అన్నారు. అది పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక కాదని, పీసీసీ ఇచ్చిన రిపోర్ట్‌ అని విమర్శించారు. కాళేశ్వరం వరప్రదాయిని అన్నది ఎంత నిజమో.. కాంగ్రెస్‌ తెలంగాణకు శనేశ్వరం అన్నది అంతే నిజమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

brs

KTR Attack Congress | కుట్ర ఉంది

మేడిగడ్డ కుంగడం వెనుక కుట్ర ఉందని కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా వాళ్లే చేసుండొచ్చని ఆరోపణలు చేశారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్‌, రెండు పిల్లర్లు కాదన్నారు. ప్రాజెక్ట్‌కు అయిన ఖర్చు రూ.94 వేల కోట్లు అయితే.. రూ.లక్ష కోట్ల కుంభకోణమని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం నిలకడ మీద తేలుతుంది అనే నానుడిని హైకోర్టు మరోసారి నిరూపించిందని కేటీఆర్​ పేర్కొన్నారు.

కేంద్రం మౌనం సరికాదు

రాష్ట్రంలో చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేల్చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విధ్వంసకర రాజకీయాలపై కేంద్రం మౌనం వహించడం సరికాదన్నారు. మేడిగడ్డ ఘటనపై నిజానిజాలు బయటకు రావాలంటే మరోసారి విశ్రాంత జడ్జితో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం కచ్చితంగా తెలంగాణకు వరప్రదాయని అని, హైకోర్టు తీర్పుతో నిజం గెలిచిందని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

దీనిని కూడా చదవండి : HYDRAA Action | రూ.90 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....