Open Exam Malpractice | ‘ఓపెన్’గానే పరీక్షలు.. కామారెడ్డి పరీక్ష కేంద్రం వద్ద ప్రత్యక్షమైన చిట్టీలు..

shashi kiran Mottala
Open Exam Malpractice | ‘ఓపెన్’గానే పరీక్షలు.. కామారెడ్డిలో బయటపడ్డ చిట్టీలు..

అక్షరటుడే, కామారెడ్డి: Open Exam Malpractice | రెగ్యులర్​గా చదువుకోలేక, మధ్యలోనే చదువు ఆపేసిన వారికి ప్రభుత్వం ఓపెన్ ఇంటర్ (Open Inter), ఓపెన్ టెన్త్(Open SSC) ద్వారా పరీక్ష రాసి ఉన్నత చదువులు చదవడానికి అవకాశాలు కల్పించింది. జిల్లాలో ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.

Open Exam Malpractice | కెమిస్ట్రీ పరీక్షలో..

జిల్లా కేంద్రంలో (Kamareddy news) మూడు పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం ఓపెన్ టెన్త్, మధ్యాహ్నం ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం ఇంటర్ కెమిస్ట్రీ పరీక్ష నిర్వహించారు. అయితే ఈ కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రచారం నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పరిశీలించగా మాస్ కాపీయింగ్ కోసం తీసుకొచ్చిన స్లిప్​లు పరీక్ష కేంద్రాల వద్ద బయటపడ్డాయి.

విద్యార్థులకు బదులు ఇతరులు..

ఈ విషయమై పలువురు వద్ద సమాచారం సేకరించగా ఒక్కో విద్యార్థి వద్ద రూ.5 వేల నుంచి రూ. 10 వేలు తీసుకుని మాస్ కాపీయింగ్​కు ప్రోత్సహిస్తున్నట్లుగా తేలింది. కొన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు బదులు ఇతరులను అనుమతిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ విషయమై విద్యాశాఖ అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. అధికారులకు తెలిసే ఇదంతా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

123 1

ఇది కూడా చదవండి: Mamata Banerjee | ఈడీ దర్యాప్తులో మమతా జోక్యం.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *