Casting Artist Harassment | సినీ అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై నటి ఫిర్యాదు

నిర్మాతను కలవాల్సి ఉందని చెప్పి తనను పిలిచాడని, ఆ తర్వాత కారులో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Casting Artist Harassment | సినీ అవకాశాలు కల్పిస్తానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై యువ నటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Casting Artist Harassment | హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇస్తానని..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ అనే వ్యక్తి తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి పరిచయం పెంచుకున్నాడని నటి ఆరోపించింది. ఓ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇస్తానని హామీ ఇచ్చి తనను సంప్రదించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

Casting Artist Harassment | నిర్మాతను కలవాల్సి ఉందని..

అనంతరం ఓ నిర్మాతను కలవాల్సి ఉందని చెప్పి తనను పిలిచాడని, ఆ తర్వాత కారులో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు కల్పిస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడని కూడా నటి తన ఫిర్యాదులో వెల్లడించింది.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఆరోపణలపై విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *