UPSC Prelims Results 2026 | సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల.. మెయిన్స్‌కు 13,343 మంది ఎంపిక

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సుమారు 5.49 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు హాజరుకానున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPSC Prelims Results 2026 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష-2026 ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల ఆధారంగా సివిల్స్ మెయిన్స్ పరీక్షకు మొత్తం 13,343 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

UPSC Prelims Results 2026 | 5.49 లక్షల మంది అభ్యర్థులు హాజరు

ఈ ఏడాది మే 24న దేశవ్యాప్తంగా నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సుమారు 5.49 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు హాజరుకానున్నారు.

అభ్యర్థులు తమ ఫలితాలను UPSC అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చని కమిషన్ సూచించింది. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, దరఖాస్తు ప్రక్రియ, ఇతర వివరాలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Casting Artist Harassment | సినీ అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై నటి ఫిర్యాదు

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *