అక్షరటుడే, ఆర్మూర్ : Paidi Rakesh Reddy | రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు.
Paidi Rakesh Reddy | జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని..
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నిక (GHMC elections) లను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఐఆర్ఎఫ్సీపై డ్రామా ప్రారంభించాడని ఆరోపించారు. ఏమీ చేయలేని స్థితిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ సంస్థ తెచ్చుకున్న వాణిజ్య రుణాలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే శాఖ నిధులు ఇస్తుందని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారో ఏ ఆర్థిక శాస్త్రంలో చదివాడో తెలియజేయాలని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణలో రాష్ట్ర వాటా చూపించే సత్తా లేని అసమర్థత రాష్ట్ర ప్రభుత్వానిదని దుయ్యబట్టారు.
Paidi Rakesh Reddy | దిగుజారుడు రాజకీయాలకు నిదర్శనం..

ఎన్నికల్లో 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మెట్రో ఫేజ్–2 కడతామని చెప్పి అబద్ధాల హామీలతో గద్దెనెక్కి ప్రస్తుతం రేవంత్‌రెడ్డి చేతులు దులుపుతున్నాడన్నారు. మెట్రో తొలిదశలో మోదీ ప్రభుత్వం నిధులు ఇచ్చిందని కేసీఆర్ పాపాల వల్ల మెట్రో నష్టపోతే దాన్ని బాగు చేయాల్సింది పోయి పక్క రాష్ట్రాల ప్రభుత్వాల మీద పడి సీఎం ఏడుస్తున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడనడం దిగజారుడు రాజకీయమన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మోచేతికి బెల్లం పెట్టారన్నారు. రైతులను నానావస్థలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పులతో కొట్టే రోజు వచ్చిందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడు.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు సమకూర్చిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: ITI Walking Association | ఐటీఐ వాకింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక