Farmer Loan Waiver | రైతులకు రుణమాఫీ.. తమిళనాడు సీఎం సంచలన ప్రకటన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Farmer Loan Waiver | తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (Tamilnadu CM Vijay) మంగళవారం కీలక ప్రకటన చేశారు. 2025 మే 1 నుండి 2026 ఫిబ్రవరి 28 మధ్య సహకార బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న రూ.75,000 వరకు గల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 14.43 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 5,932 కోట్ల అదనపు భారం పడుతుందని విజయ్​ తెలిపారు. అయితే ఇది రైతులకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. రూ. 75,000 కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులకు రూ. 35,000 వరకు మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

Farmer Loan Waiver | రైతుల విన్నపం మేరకు

Farmer Loan Waiver

సన్న, చిన్నకారు రైతులు సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న రూ. 50,000 వరకు రుణాలను మాఫీ చేస్తున్నట్లు గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతుల విజ్ఞప్తి మేరకు తాజాగా ఆ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచింది. రాబోయే సాగు సీజన్ కోసం రుణాలు పొందాలనుకునే రైతులకు ఈ పంట రుణ మాఫీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని విజయ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Monsoon Preparedness | వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ సీవీ ఆనంద్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *