అక్షరటుడే, వెబ్‌డెస్క్: Redmi Turbo 5 | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన రెడ్‌మీ భారత మార్కెట్‌లోకి మరో మోడల్‌ను తీసుకువచ్చింది. రెడ్‌మీ టర్బో 5 పేరుతో మిడ్ రేంజ్ ఫోన్‌ను మంగళవారం (జూన్ 16న) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేసింది.
మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్, 7560 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చిన ఈ ఫోన్ జూన్ 19 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ (Amazon)లో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.59 ఇంచ్ 1.5కే ఓఎల్ ఈడీ డిస్ ప్లే అమర్చారు. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన ఈ ఫోన్.. 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1268 x 2756 పిక్సల్స్ రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. ఐపీ 66, 68 69, 69కే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.
ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ తో వచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఇందులోని అడ్వాన్స్‌డ్ త్రీడీ ఐస్ కూల్ లూపింగ్ సిస్టం ఫోన్ వేడెక్కకుండా చూస్తుంది.
Redmi Turbo 5 | కెమెరా సెటప్..
వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఉంది. దీనితో 4కే వీడియోలు రికార్డ్ చేయొచ్చు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ : 7540 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్, 27 వాట్ రివర్స్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 30 నిమిషాల్లో 50 శాతం, 70 నిమిషాల్లో 100 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. 1600 చార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ 80 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొంటోంది.
Redmi Turbo 5 | వేరియంట్స్..
టర్బో వైట్, నిట్రో బ్లూ, అస్ఫాల్ట్ బ్లాక్ కలర్స్‌లో రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉండనుంది.
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999.
12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,999.
Redmi Turbo 5 | కార్డ్ ఆఫర్లు..
ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగులు చేస్తే రూ. 2 వేల వరకు డిస్కౌంట్ అందనుంది.
ఇది కూడా చదవండి..: Stock Market Gains | లాభాల్లో సూచీలు