RTC Strike | ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించాలి : డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబబాద్​ సిటీ: RTC Strike | ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న సమ్మెను విరమించాలని.. ఇప్పటికే వారికి సంబంధించిన 29 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ(Bobbili Ramakrishna) కోరారు. ఈ మేరకు సమ్మె చేస్తున్న కార్మికుల వద్దకు జిల్లా కాంగ్రెస్ కమిటీ(DCC Nizamabad) అధ్యక్షుడు నగేష్ రెడ్డితో కలిసి వెళ్లి మాట్లాడారు.

RTC Strike | మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆదేశాలతో..

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Transport Minister Ponnam) ఆదేశాల మేరకు నగేష్​రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ కలిసి ఆర్టీసీ కార్మికులతో మాట్లాడారు. ఆర్టీసీ (Telangana RTC) ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుందన్నారు. కార్మికులు చెప్పిన డిమాండ్లను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. కార్మికుల 32 డిమాండ్లలో ఇప్పటికే 29 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని స్పష్టం చేశారు. మిగిలిన మూడు డిమాండ్లను కూడా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నెరవేర్చే ప్రయత్నం చేస్తారన్నారు. అప్పటివరకు కార్మికులు సమ్మెను విరమించుకోవాలని సూచించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆర్టీసీ పాత్ర ఎంతో ఉందని.. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆర్టీసీ ఇబ్బందుల్లో లేదని.. కానీ బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాకే సంస్థను అప్పుల పాలు చేసిందన్నారు.

RTC Strike | పూర్తి బాధ్యత కాంగ్రెస్​దే..

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తామని ప్రకటించిన వెంటనే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆరు గంటల్లోనే చర్చలకు మీ వద్దకు వచ్చామని నగేష్​రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఆర్టీసీపై మాకు ఉన్న బాధ్యత ఇదన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వెంకట్రావు రెడ్డి, గోపి గాదరి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, జిల్లా సేవాదల అధ్యక్షులు సంతోష్, కార్పొరేటర్లు అన్వర్, ఆదిత్య, ప్రవీణ్ గౌడ్, మనోహర్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినయ్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెయిన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Gig Workers Compensation | మరణించిన గిగ్ వర్కర్ల కుటుంబాలకు పరిహారం అందజేత

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *