Shabbir Ali Flexies | షబ్బీర్​ అలీకి మద్దతుగా గాంధీ భవన్​లో ఫ్లెక్సీలు

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shabbir Ali Flexies | కామారెడ్డి కాంగ్రెస్ (Kamareddy Congress)​లో నెలకొన్న విభేదాలు గాంధీ భవన్​కు చేరాయి. సీనియర్​ నేత షబ్బీర్​ అలీ, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్​రెడ్డి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

తాజాగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్‌ (Gandhi Bhavan)లో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది. ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించడంలో కీలకపాత్ర పోషించిన నేతగా షబ్బీర్ అలీని ప్రశంసిస్తూ, ‘నిజం ఎప్పటికీ మరుగున పడదు.. నిజమైన నాయకుడిని ఎవరూ తక్కువ చేయలేరు’ అని ఫ్లెక్సీలు చేశారు. పార్టీకి విధేయుడైన నాయకుడు, మహిళలను గౌరవించే వ్యక్తి, నిజాలు ఎప్పటికైనా బయటపడతాయని ఫ్లెక్సీలో రాశారు.

Shabbir Ali Flexies | ముదురుతున్న వివాదం

Shabbir Ali Flexies

కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్​పర్సన్​ ఇందుప్రియ భర్త చంద్రశేఖర్​రెడ్డి మూడు నక్కలు అని వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్​లో వివాదం మొదలైంది. ఆయన షబ్బీర్​అలీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో షబ్బీర్​ వర్గం వారు మండిపడ్డారు. మరోవైపు షబ్బీర్​ అలీకి చెందినది ఇటీవల ఓ ఆడియో బయటపడటంతో కాంగ్రెస్​లో వర్గపోరు రచ్చకెక్కింది. ఈ నేపథ్యంలో పార్టీ షబ్బీర్​ అలీకి నోటీసులు సైతం ఇచ్చింది. అయితే ఆ ఆడియో ఫేక్​ అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే సీనియర్​ నాయకుడు అయిన షబ్బీర్​ అలీకి నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్​లో వివాదం ముదురుతోంది. ఈ క్రమంలో గాంధీ భవన్​లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: Harish Rao Allegations | హరీశ్​రావుకు మంత్రులు పొన్నం, అడ్లూరి కౌంటర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *