అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Subway Outlet | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లపై అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కల్తీ ఆహార పదార్థాలు, పరిశుభ్రత పాటించకపోవడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Hyderabad Subway Outlet | నోటీసులు
హైదరాబాద్ నగరంలోని కొండాపూర్లో గల సబ్వే అవుట్లెట్లో బుధవారం అధికారులు తనిఖీలుచేశారు. ఈ సందర్భంగా కుళ్ళిన లెట్యూస్, గడువు ముగిసిన కూరగాయలు, వంట చేసే ప్రాంతంలో ఈగలను గుర్తించారు. పరిశుభ్రతలో ఆ అవుట్లెట్ 96 మార్కులకు కేవలం 58 (60%) మాత్రమే సాధించింది. కుళ్లిన, లేబుల్ లేని కూరగాయలను అక్కడికక్కడే పారవేశారు. సబ్వే నిర్వాహకులకు నోటీసు జారీ చేశారు.
Hyderabad Subway Outlet | ప్రముఖ రెస్టారెంట్లలో సైతం

నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో సైతం నిబంధనలు పాటించడం లేదు. వీటిలో ధరలు అధికంగా ఉంటాయి. దీంతో అంతా బాగా ఉంటుందని ప్రజలు వస్తుంటారు. అయితే పరిశుభ్రత పాటించకపోవడం, కుళ్లిన ఆహార పదార్థాలు వినియోగించడం వంటివి చేస్తూ వీరు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
ఇది కూడా చదవండి..: ABVP Protest | సర్కారు బడుల పరిరక్షణకు నడుం బిగించిన ఏబీవీపీ.. పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా.. ఉద్రికత్త.. విద్యార్థి నాయకుల అరెస్టు!