అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Employee Health Trust | ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తామని తెలిపిందే. ఈ మేరకు తాజాగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం కొత్త హెల్త్ స్కీమ్ తీసుకు రానుంది. దీని కోసం ఉద్యోగుల జీతాల్లో నుంచి కొంత మొత్తం కట్ అవుతుంది. అంతేమేర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఈ డబ్బులు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (EHCT)లో జమ అవుతాయి. వాటిని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆస్పత్రి పాలు అయినప్పుడు ఉపయోగిస్తారు. తాజాగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
Employee Health Trust | ట్రస్ట్‌లో 30 మంది సభ్యులు
ట్రస్ట్‌లో ఛైర్మన్‌తో సహా 30 మంది సభ్యులు ఉంటారు. ఛైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొనసాగుతారు. వివిధ శాఖల కార్యదర్శులు మెంబర్లుగా ఉంటారు. ఉద్యోగ సంఘాల నుంచి 10 మందిని ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. ఒక్కో సంఘం నుంచి ఒక్కొక్కరిని నియమించింది. అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి ముగ్గురికి స్థానం కలిగించింది. ఉద్యోగుల జీతం, ప్రభుత్వం జమ చేసే నిధులను ఈ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో వెలువడనున్నాయి.
Reconstitution of the Board of Trustees of the Employees Health Care Trust (EHCT) for Implementation of the Employees Health Scheme (EHS) – Orders Issued. pic.twitter.com/mB4xZW8oHC
— Jacob Ross (@JacobBhoompag) June 17, 2026
ఇది కూడా చదవండి : Fake Task Force Police | టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి దోపిడీ.. ఐదుగురి అరెస్ట్