June 18 Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్

గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.40 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 18 Market Analysis | ప్రధాన ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

కొత్త చీఫ్ కెవిన్ వార్ష్ నేతృత్వంలోని యూఎస్ ఫెడరల్(US Fed) రిజర్వ్ కీలక వడ్డీ రేటును ప్రస్తుతం యథాతథంగా ఉంచింది. అయితే కొత్త త్రైమాసిక అంచనాల ప్రకారం అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి 2026 చివరి నాటికి కనీసం ఒక వడ్డీ రేటు పెంపు ఉంటుందని తొమ్మిది మంది సెంట్రల్ బ్యాంక్ అధికారులు భావిస్తున్నారు. దీంతో వాల్‌స్ట్రీట్(Wallstreet) గత సెషన్‌లో నష్టాలతో ముగిసింది.

ప్రధాన ఆసియా మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే ప్రీమియంతో ట్రేడవుతోంది. ఇది భారత స్టాక్ మార్కెట్ సూచీలు గ్యాప్ అప్‌లో ప్రారంభమవుతాయని సూచిస్తోంది.

June 18 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.34 శాతం, ఎస్ అండ్ పీ 1.21 శాతం నష్టపోగా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.98 శాతం నష్టంతో ఉంది.

June 18 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.10 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.14 శాతం పెరగ్గా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.20 శాతం నష్టపోయింది.

June 18 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 1.73 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.91 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.69 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.13 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.02 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.51 శాతం నష్టంతో కదలాడుతోంది. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.40 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 101 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డీఐఐలు వరుసగా 22వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,561 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.08 నుంచి 1.1 కు పెరిగింది.
  • విక్స్ 1.31 శాతం తగ్గి 13.19 వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు బలపడి 94.53 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.29 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.46 వద్ద ఉన్నాయి.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 78.30 డాలర్ల వద్ద ఉంది.
  • మే నెలలో యూఎస్ రిటైల్ అమ్మకాలు అంచనాలకంటే ఎక్కువగా పెరిగాయి. ఏప్రిల్‌లో 0.4 శాతం వృద్ధి నమోదుకాగా.. గత నెలలో రిటైల్ అమ్మకాలు 0.9 శాతం పెరగడం గమనార్హం.

యుద్ధాన్ని ముగించేందుకు ఇరు దేశాల అధ్యక్షులు సంతకం చేసిన మధ్యంతర ఒప్పంద పత్రాన్ని యూఎస్, ఇరాన్‌లు బుధవారం విడుదల చేశాయి. తమ కట్టుబాట్లను గౌరవించడంలో విఫలమైతే దాడులను పునఃప్రారంభిస్తామని, ఇరాన్ అధికారులను చంపుతామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరుపక్షాలు ఎలక్ట్రానిక్‌గా సంతకం చేసిన ఈ ఒప్పందం వెంటనే అమలులోకి వచ్చిందని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ద్రువీకరించారు.

Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *