Stock Market Losses | స్వల్ప నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్వల్ప నష్టాలతో కదలాడుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 137 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | అమెరికాలో అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఈ ఏడాది చివరి నాటికి కనీసం ఒక వడ్డీ రేటు పెంపు ఉంటుందన్న అంచనాలతోపాటు యÖఎస్ ఫెడ్ కొత్త చీఫ్ కెవిన్ వార్ష్ హాకిష్ కామెంట్ చేశారు.

Stock Market Losses | మరింత బలపడి ఈక్విటీ మార్కెట్లు

దీంతో డాలర్ ఇండెక్స్ మరింత బలపడి ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. దీని ప్రభావం గత సెషన్‌లో యÖఎస్ మార్కెట్లపై కనిపించింది. గురువారం ఆసియా మార్కెట్లు సైతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ముడిచమురు ధరలు దిగివస్తున్నా.. రూపాయి బలోపేతం అవుతున్నా దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం స్తబ్ధుగా కదలాడుతున్నాయి.

Stock Market Losses | స్వల్ప రేంజ్‌లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 262 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 189 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 287 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 66 పాయింట్లు పైకి ఎగబాకింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 81 పాయింట్లు పడిపోయింది. సెన్సెక్స్ 76,953 నుంచి 77,320 పాయింట్ల రేంజ్‌లో, నిఫ్టీ 24,037 నుంచి 24,139 పాయింట్ల రేంజ్‌లో కదలాడుతున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 137 పాయింట్ల నష్టంతో 77,018 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 24,054 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 9 స్టాక్స్ లాభాలతో, 21 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్ 2.62 శాతం, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ 1.39 శాతం, బీఈఎల్ 1.00 శాతం, హెచ్యూఎల్ 0.55 శాతం, ఎస్బీఐ 0.41 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఇన్ఫోసిస్ 2.49 శాతం, టీసీఎస్ 1.52 శాతం, ఎటర్నల్ 1.20 శాతం, టెక్ మహీంద్రా 1.10 శాతం, కొటక్ బ్యాంక్ 0.94 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: June 18 Gold Market | అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం.. పెరిగిన బంగారం, వెండి ధరలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *