Mayor Umarani Visit | ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : మేయర్ ఉమారాణి

నగరంలో సమస్యల పరిష్కారినికి కృషి చేస్తామని మేయర్​ ఉమారాణి తెలిపారు. పలు డివిజన్​లలో ఆమె పర్యటించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mayor Umarani Visit | నగరంలోని ఆయా డివిజన్లలో సమస్యల పరిష్కారానికి నిరంతరంగా కృషి చేస్తున్నామని మేయర్ ఉమారాణి (Mayor Umarani) తెలిపారు. నగరంలోని పలు డివిజన్​లలో గురువారం ఆమె పర్యటించారు.

Mayor Umarani Visit | స్థానిక ప్రజలతో మాట్లాడుతూ..

Mayor Umarani Visit

నగరంలోని 37, 39 డివిజన్​లలో మేయర్ కూరగాయల ఉమారాణి పర్యటించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, పారిశుధ్యం, డ్రెయినేజీ వ్యవస్థ రోడ్ల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తమ దృష్టికి తెచ్చిన సమస్యలపై వెంటనే స్పందించిన మేయర్ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  చెత్త సేకరణ, కాలువల శుభ్రత, దోమల నివారణ చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆమె హెచ్చరించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Education Hub | ఉన్నత విద్య అందని ద్రాక్ష.. మాటలకే పరిమితమైన ఎడ్యుకేషన్​ హబ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *