Kakatiya Engineering Graduates | విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి: తెయూ రిజిస్ట్రార్​

విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించేందుకు తమ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని తెయూ రిజిస్ట్రార్​ యాదగిరి సూచించారు. నిజామాబాద్​ నగరంలో కాకతీయ ఇంజినీరింగ్​ కళాశాల ఆధ్వర్యంలో స్నాతకోత్సవం నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Kakatiya Engineering Graduates | నేటి సమాజంలో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని.. తమ లక్ష్యాలను చేరుకునేందుకు సామర్థ్యాలను పెంపొందించుకోవాలని తెయూ రిజిస్ట్రార్​(TU registrar) యాదగిరి సూచించారు. నగరంలోని శ్రీరామ గార్డెన్స్​లో కాకతీయ ఇంజినీరింగ్​ కళాశాల ఆధ్వర్యంలో స్నాతకోత్సవం (Convocation) నిర్వహించారు. తెయూ రిజిస్ట్రార్​ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Kakatiya Engineering Graduates | కాకతీయ ఇంజినీరిగ్​ కళాశాల..

ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడాలంటే విద్యార్థినులు ఎప్పటికప్పుడు అప్​డేట్​ అవుతూ (career development) ముందుకెళ్లాలని రిజిస్ట్రార్​ సూచించారు. అనంతరం ఆయన విద్యార్థినులకు ఇంజినీరింగ్​ పట్టాలు అందజేశారు. కళాశాల డైరెక్టర్ చెరుకూరి రజనీకాంత్​ విద్యార్థినులను అభినందించారు. వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో మా కళాశాల నుంచి 232 మంది విద్యార్థినులు ఇంజినీరింగ్ పట్టాలు పొందడం.. చాలామంది వివిధ సాఫ్ట్​వేర్​ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్​ సెల్యం కుమార్ రాజా మాట్లాడుతూ మా కళాశాల నుంచి పట్టాలు పొందిన విద్యార్థినులు ఏ రంగంలో ఉన్నా కళాశాలకు, తల్లిదండ్రులకు, సమాజానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.  కార్యక్రమంలో ఎస్టేట్ మేనేజర్ నాగేశ్వశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ జి.సాయరెడ్డి, వివిధ శాఖల అధిపతులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

kakatiya

2 1 3 5 6

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *