SIR Survey Process | ‘సర్​’ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్​ జిల్లాలో ‘సర్​’ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

Shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: SIR Survey Process |  జిల్లాలో ‘సర్​’ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశించారు. నగరంలోని న్యూ అంబేడ్కర్​ భవన్​లో గురువారం నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

SIR Survey Process | ఈనెల 25వ తేదీ నుంచి..

ఈనెల 25 నుంచి జూలై 24 వరకు బీఎల్​వోలు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటరు మ్యాపింగ్​ను పూర్తి చేయాలని కలెక్టర్​ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో పాల్గొంటున్న బీఎల్​వోలకు సర్వే కాలంలో నెల రోజుల పాటు వారి శాఖలకు సంబంధించిన విధుల నుంచి మినహాయింపు కల్పించారని కలెక్టర్ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎస్ఐఆర్ పైనే పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరిస్తూ, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు ఇతర ప్రాంతానికి శాశ్వతంగా వలస వెళ్లారా.. మృతి చెందారా, రెండు చోట్ల పేర్లు ఉన్నాయా అనే అంశాలను నిశితంగా గమనించాలని సూచించారు.

SIR Survey Process | ‘సర్’​ ఆధారంగానే ఓటరు జాబితా..

ఎస్ఐఆర్ సర్వే వివరాల ఆధారంగానే ఓటరు జాబితాను రూపొందించనున్న దృష్ట్యా పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే జరపాలని కలెక్టర్​ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని, ఏవైనా సందేహాలు ఉంటే ఏమాత్రం సంకోచించకుండా శిక్షణ తరగతులలో నివృత్తి చేసుకోవాలని సూచించారు. శిక్షణా తరగతులలో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్​వోలు, బీఎల్​వోలు, సూపర్​వైజర్లు పాల్గొన్నారు.SIR Survey Process

ఇది కూడా చదవండి..: Farmer Fertilizer Protest | రేవంత్‌ తుగ్లక్‌ పాలనలో రైతులు రోడ్డు పాలయ్యారు..: మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *