అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shamshabad Drugs Seizure | హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.7 కోట్ల విలువైన 7.118 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Shamshabad Drugs Seizure | హైడ్రోపోనిక్ గంజాయి
వియత్నాం నుంచి బ్యాంకాక్ మార్గంగా శంషాబాద్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడి వద్ద ఈ మాదకద్రవ్యాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. అనుమానాస్పదంగా కనిపించిన సామానును క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో హైడ్రోపోనిక్ గంజాయి దాచిపెట్టినట్లు బయటపడింది.
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల అంతర్జాతీయ మార్కెట్ విలువ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
అంతర్జాతీయ స్మగ్లింగ్
ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తరలించారు, వీటి వెనుక ఉన్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
UAE Social Media | 15 ఏళ్లు నిండితేనే సోషల్ మీడియా ఖాతాలు.. యూఏఈ సంచలన నిర్ణయం