ఆంధ్రప్రదేశ్​Anantapur honey trap | హనీట్రాప్ కలకలం.. ఉచ్చులో రియల్టర్, జ్యోతిష్యుడు

Anantapur honey trap | హనీట్రాప్ కలకలం.. ఉచ్చులో రియల్టర్, జ్యోతిష్యుడు

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి, ముఠా సభ్యులను గుర్తించే పనిలో ఉన్నారు. జిల్లాలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Anantapur honey trap | ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురంలో హనీట్రాప్ వ్యవహారం కలకలం రేపింది. మహిళలను ఎరగా వేసి, లక్షల రూపాయలు దోచుకుంటున్న ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి.

Anantapur honey trap | పని ఉందంటూ..

సదరు హనీట్రాప్​ ముఠా ముందుగా బాధితులను టార్గెట్ చేసి “పని ఉంది” అంటూ మహిళను పంపిస్తుంది. ఆ తర్వాత ఏకాంతంగా మాట్లాడుతున్న సమయంలో ముఠా సభ్యులు అకస్మాత్తుగా దాడి చేసి బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. డబ్బు ఇవ్వకపోతే రేప్ కేసులు పెడతామని బెదిరిస్తూ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు.

ఇప్పటికే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి దాదాపు రూ.10 లక్షలు, జ్యోతిష్యుడి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితులు ఇప్పటికే అనంతపురం ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేశారు.

Anantapur honey trap | నెట్టింట వైరల్​..

ఇక ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం మరింత చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో రాప్తాడు సీఐ హర్షను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపినట్లు సమాచారం.

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి, ముఠా సభ్యులను గుర్తించే పనిలో ఉన్నారు. జిల్లాలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Vijayawada college harassment | ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం

ఇది కూడా చదవండి: Indian Woman Speech | ‘మతాన్ని మార్చం.. మనసులను గెలుస్తాం!’ టెక్సాస్ కౌన్సిల్ హాల్‌లో ప్రతిధ్వనించిన భారతీయ గళం

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...