Allu Arjun Summons | అల్లు అర్జున్​కు కోర్టు సమన్లు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Allu Arjun Summons | సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు (Nampally Court) సమన్లు జారీ చేసింది. వచ్చే సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

పుష్ప–2 సినిమా ప్రీమియర్​ సమయంలో హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని ఆర్టీసీ క్రాస్​రోడ్స్​లో గల సంధ్యా థియేటర్​లో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హీరో అల్లు అర్జున్​ థియేటర్​కు రావడంతో ఆయనను చూడటానికి అభిమానులు ఒక్కసారిగా లోపలకి వచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడితో పాటు పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Allu Arjun Summons | ఏ 11 గా అల్లు అర్జున్​

Allu Arjun Summons

ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. హీరో అల్లు అర్జున్​ ఏ–11గా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు నిందితులు అందరికి సమన్లు జారీ చేసింది. 23 మందిపై ఇప్పటికే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి..: Venky Anil Movie | వెంకీ, అనిల్ రావిపూడి సినిమా షూటింగ్​ ప్రారంభం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *