Gandhi Sarovar Project | గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు రక్షణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు రక్షణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ బాపు ఘాట్‌ వద్ద గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌ పనులకు ఆమోదం తెలిపింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gandhi Sarovar Project | గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు రక్షణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ (Hyderabad) బాపు ఘాట్‌ వద్ద గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌ పనులకు ఆమోదం తెలిపింది. మూసీ నది పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి విజన్‌లో ఇది కీలక మైలురాయి అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.

మూసీ నది ప్రక్షాళనను సీఎం రేవంత్​రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లంగర్​హౌజ్​ శివారులో బాపూఘాట్​ వద్ద మూసీ తీరాన గాంధీ సరోవర్​ ప్రాజెక్ట్ నిర్మించాలని ప్రభుత్వం భావించింది. తాజాగా ఈ ప్రాజెక్ట్​కు కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతులు లభించడంతో సీఎం హర్షం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

Gandhi Sarovar Project | ప్రజలకు ఆహ్లాదం

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించడం, తెలంగాణ ప్రభుత్వ విజన్ లక్ష్యాలను సాధించడంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవనం, నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, పర్యావరణ, సాంస్కృతిక, సామాజిక వనరుల సృష్టి దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ నిర్ణయం మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ పరీవాహక ప్రాంతం పర్యావరణపరంగా పునరుజ్జీవం పొందడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందన్నారు.

ఇది కూడా చదవండి : Jio IPO Announcement | ఐపీవోకు రిలయన్స్ జియో.. ముకేశ్ అంబానీ కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *