జాతీయంPune sex racket | “180 మంది అమ్మాయిలను లోబర్చుకుని.. 350కి పైగా వీడియోలు చిత్రీకరించి.....

Pune sex racket | “180 మంది అమ్మాయిలను లోబర్చుకుని.. 350కి పైగా వీడియోలు చిత్రీకరించి.. 19 ఏళ్ల కామాంధుడి కీచకపర్వం”

యువకుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సుమారు 180 మంది యువతులను ట్రాప్ చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మొదట స్నేహం పేరుతో దగ్గరవుతూ, తర్వాత మాయమాటలతో మోసం చేసి వారిని తన వలలోకి లాగినట్లు విచారణలో తేలింది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pune sex racket | సోషల్ మీడియా వేదికగా ఏర్పడే పరిచయాలను, నెట్‌వర్క్‌ను దుర్వినియోగం చేసి వందల మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసి ఒక కిరాతక ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. పుణే సెక్స్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన అయాన్ అహ్మద్ తన్వీర్ (19) అనే యువకుడు చేసిన దారుణాలు సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్నాయి.

Pune sex racket | స్నేహం పేరుతో….

తన్వీర్ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దాదాపు 180 మంది యువతులను ట్రాప్ చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మొదట స్నేహం పేరుతో దగ్గరయ్యేవాడు. తర్వాత మాయమాటలతో మోసం చేసి వారిని తన మాయలోకి లాగేవాడని విచారణలో తేలింది. అనంతరం బాధిత యువతులను లోబరుచుకునేవాడు. ఇలా బాధితులపై 350కి పైగా అశ్లీల వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనలో బలైన యువతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నమ్మకం పెట్టుకున్న వ్యక్తే వారి జీవితాలను చీకటిలోకి నెట్టేశాడని బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. అనేక మంది యువతులు మానసికంగా తీవ్రంగా కుంగిపోయినట్లు సమాచారం.

Pune sex racket | వీధుల్లో ఊరేగింపు..

నిందితుడి కిరాతక చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో మహారాష్ట్ర పోలీసులు అతడిని పరాట్వాడ నగర వీధుల్లో చేతులకు సంకెళ్లు వేసి ఊరేగించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఇది గట్టి హెచ్చరికగా ఉండాలని పోలీసులు ఈ చర్య చేపట్టినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుడిపై మరింత లోతైన విచారణ కొనసాగుతోంది. కాగా, ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కఠిన చట్టాలు, కఠిన శిక్షలు అమలు చేయాలని సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Vijayawada college harassment | ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం

ఇది కూడా చదవండి: Indian Woman Speech | ‘మతాన్ని మార్చం.. మనసులను గెలుస్తాం!’ టెక్సాస్ కౌన్సిల్ హాల్‌లో ప్రతిధ్వనించిన భారతీయ గళం

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

DJ Sound | డీజే శబ్దం భరించలేక 140 కోళ్లు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన

అక్షరటుడే, వెబ్​డెస్క్: DJ Sound | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని...

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...