అక్షరటుడే, వెబ్‌డెస్క్: Wife Torture Case | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) కోరియా జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తల దించుకునే పనిచేశాడు ఓ వ్యక్తి. తన భార్య ప్రవర్తనపై అనుమానంతో జితేంద్ర ఘాసియా అనే వ్యక్తి కన్నబిడ్డల ముందే ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. బాధితురాలి కాళ్లు, చేతులు కట్టేసి గుండు గీయించడంతో పాటు బలవంతంగా మూత్రం తాగించాడు. ఆపై వీడియో కూడా తీశాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లా (Korea District)కు చెందిన ఒక మహిళ తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన పిల్లలు భయంతో చూస్తుండగానే, అతను తన చేతులు-కాళ్లు కట్టివేసి, గుండు గీసి, ముఖానికి మసి పూసి, క్రూరంగా కొట్టి, బలవంతంగా మూత్రం తాగించాడని ఆమె పేర్కొంది.
Wife Torture Case | ప్రేమ వివాహం
సుమారు 15 ఏళ్ల క్రితం జితేంద్ర ఘసియాతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న తార అనే మహిళకు సంబంధించిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఒక వీడియోలో కనిపించాయి. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలు, వేధింపుల ఆరోపణలు, ఆర్థిక ఇబ్బందులతో ఆమె విడిగా ఉంటుంది. తనను, పిల్లలను పోషించుకోవడానికి ఇళ్లలో పని చేస్తోంది.
Wife Torture Case | అనుమానంతో..
కష్టకాలంలో తనకు సహాయం చేసిన ఒక పరిచయస్తుడి ఇంట్లో ఉంటున్నప్పుడు, జూన్ 14న తన భర్త వచ్చాడని ఆమె పేర్కొంది. బయటకు పిలిచిన తర్వాత తనను దూషిస్తూ, ఇతర పురుషులతో సంబంధాలు ఉన్నాయని దాడికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన చేతులు, కాళ్లను తాడుతో కట్టివేసి క్రూరంగా దాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. “అతను నా జుట్టు కత్తిరించి గుండు గీశాడు, ముఖానికి మసి, ఇంజిన్ ఆయిల్ పూశాడు, నన్ను కొట్టి బలవంతంగా మూత్రం తాగించాడు. నన్ను సజీవ దహనం చేస్తానని బెదిరించాడు,” అని ఆమె ఆరోపించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: Pakistan Civilian Handover | సరిహద్దుల్లో మానవత్వం: ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత్-పాక్ సైనికాధికారుల అరుదైన కరచాలనం!