అక్షరటుడే, వెబ్డెస్క్: IIRF Rankings 2026 | ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం దేశంలోని టాప్-10 కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం (University of Hyderabad) చోటు దక్కించుకుంది. దేశంలోని యూనివర్సిటీల్లో సౌకర్యాలు, బోధన, ఇతర వసతులను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ విడుదల చేస్తారు.
ఈ జాబితాలో ఢిల్లీలోని జేఎన్యూ మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకుంది. కాశీలోని బనారస్ యూనివర్సిటీ ఐదో స్థానంలో నిలిచింది.
IIRF Rankings 2026 | తెలంగాణ నుంచి 3 యూనివర్సిటీలు
ఆంధ్రప్రదేశ్లోని సెంట్రల్ యూనివర్సిటీ (అనంతపూర్) 21వ ర్యాంక్ సాధించింది. హైదరాబాద్లోని మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్సిటీ 31, ఇఫ్లూ 38 ర్యాంక్లు సాధించాయి. మొత్తం 50 యూనివర్సిటీలతో జాబితా విడుదల చేయగా తెలంగాణ నుంచి మూడు విశ్వవిద్యాయాలు చోటు దక్కించుకున్నాయి.
ఇది కూడా చదవండి..: Tellapur Lake | కాంక్రిట్ జంగిల్లో.. ఆహ్లాదం పంచే చెరువు