అక్షరటుడే వెబ్‌డెస్క్: Mynampally KTR Warning | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను ఉద్దేశించి కేటీఆర్ చేసిన ‘గుండాయిజం’ వ్యాఖ్యలను మైనంపల్లి తిప్పికొట్టారు. ఫోన్ ట్యాపింగ్ , సెలబ్రిటీల జీవితాలను నాశనం చేయడమే కేటీఆర్ నైజమని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
Mynampally KTR Warning | గుండాయిజంపై మైనంపల్లి ఘాటు స్పందన..
తాజాగా కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను గుండాయిజం చేస్తాడని కేటీఆర్ నిందలు వేయడం సరికాదని, తన చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు చేయడం కేటీఆర్ సంస్కారానికి నిదర్శనమని మైనంపల్లి ఎద్దేవా చేశారు.
Mynampally KTR Warning | సెలబ్రిటీల జీవితాలతో చెలగాటం..
ఈ సందర్భంగా కేటీఆర్ రాజకీయ తీరుపై మైనంపల్లి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేటీఆర్ పని కేవలం ఫోన్ ట్యాపింగ్ చేయడం, ప్రముఖుల, సెలబ్రిటీల జీవితాలను నాశనం చేయడమేనని ఆయన మండిపడ్డారు. పదవుల్లో ఉన్నప్పుడు కేటీఆర్ అనుసరించిన విధానాలు, ప్రజల వ్యక్తిగత గోప్యతను భంగపరిచేలా ఉన్నాయని మైనంపల్లి విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులకు పాల్పడటం దారుణమని ఆయన పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చేసుడు, సెలబ్రిటీల జీవితాలు నాశనం చేయడమే కేటీఆర్ పని..: మైనంపల్లి
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పై మైనంపల్లి హన్మంత్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి గుండాయిజం చేస్తడు అని కేటీఆర్ కామెంట్స్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్ర స్థాయిలో… pic.twitter.com/NElHRBsbTR
— Akshara Today | Telugu News (@aksharatoday) June 20, 2026
ఇది కూడా చదవండి: Bengaluru Mobile Theft | వింత ఘటన.. మొబైల్ చోరీ చేసి పారిపోతుండగా గుండెపోటు