Two-Headed Calf | ఆర్మూర్​లో వింత.. రెండు తలలతో దూడ జననం

ఆర్మూర్​ మున్సిపాలిటీ పరిధిలో వింత చోటుచేసుకుంది. రెండు తలలతో దూడ జన్మించింది.

Shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Two-Headed Calf | ఆర్మూర్​ మున్సిపాలిటీ (Armoor Municipality) పరిధిలో వింత చోటుచేసుకుంది. రెండు తలలతో దూడ జన్మించింది.

Two-Headed Calf | కోటార్మూర్​కు చెందిన..

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్​కు (Kotarmoor) చెందిన గంగరాం యాదవ్​కు చెందిన గేదె రెండు తలలతో దూడకు జన్మనిచ్చింది. రెండు తలలతో పుట్టడంతో ఆశ్చర్యానికి గురైన గంగారం వెంటనే స్థానిక పశువైద్య అధికారి  రాజేశ్వర్​కు సమచారం అందించాడు. ఆయన దూడను పరీక్షించారు. ప్రస్తుతం దూడ ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్​ మాట్లాడుతూ.. గేదె రెండు తలలతో దూడను జన్మించడం మొదటిసారిగా చూస్తున్నామన్నారు. ప్రస్తుతం గేదె, దూడ ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. రెండు తలలతో జన్మించడంతో చుట్టుపక్కల ప్రజలు అక్కడికి వచ్చి దూడను వింతగా చూస్తున్నారు.

armoor 1

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *