అక్షరటుడే, వెబ్డెస్క్ : Vijay Dairy Support | రాష్ట్రంలో పాడి రైతులను ఆదుకోవడంతో పాటు విజయా డైరీనీ ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు,అంగన్ వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ నుంచి పాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం సచివాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశంంలో డిప్యూటీ సీఎంతో పాటు పశుసంవర్ధక శాఖా మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. రాష్ట్రంలో పాల వినియోగం, సేకరణ, రైతులకు చెల్లించాల్సిన బిల్లులపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాల వినియోగం, కొత్తగా ప్రభుత్వం ప్రకటించిన మేరకు వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థులకు పాలను అందించే అంశంపై అధికారులతో చర్చించారు.
Vijay Dairy Support | ఉత్పత్తిని లెక్కగట్టి
రాష్ట్రవ్యాప్తంగా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పాలిచ్చే పశువుల అసలు సంఖ్యను గుర్తించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పాలిచ్చే పశువుల ద్వారా వస్తున్న వాస్తవ ఉత్పత్తిని లెక్కగట్టి సమగ్ర నివేదికను తదుపరి సమావేశంలో ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతుల నుంచి సేకరించే పాల ధరపై స్పష్టమైన విధానం ఉండాలన్నారు. రైతులకు బకాయులు లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలన్నారు. పాఠశాలలకు సరఫరా చేసే పాలకు సంబంధించిన బిల్లులను సంక్షేమ శాఖలు నేరుగా ఆయా విభాగాలకే బదిలీ చేయాలని చెప్పారు.
ఇది కూడా చదవండి : PM Kisan 23rd Installment | రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల